Mon Jan 13 2025 18:15:50 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఆ పదకొండు సీట్లు ఎందుకిచ్చామని ప్రజలు బాధపడుతున్నారు
పేర్ని నాని కి శ్వేత పత్రం అంటే ఏందో తెలుసా అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
పేర్ని నాని కి శ్వేత పత్రం అంటే ఏందో తెలుసా..ఎప్పుడైనా వైసిపి వాళ్లు శ్వేత పత్రాలు విడుదల చేశారా అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంతో చంద్రబాబు పర్యటన చేస్తున్నారన్నారు. గత ఐదేళ్లలో మీ పరిపాలన ఎలా చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని అందుకే శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. వైసీపీ వాళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడి ప్రెస్ మీట్ లు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సీఎం అవ్వగానే పెంచిన పింఛన్ ను అందించారని, జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజావేదిక కూల్చారన్నారు.
చెత్త పన్ను వేసిందెవరు?
అసలు చెత్త పన్ను వేసింది ఎవరని? మీరు ఐదు సంవత్సరాలు పాటు రాష్ట్రాన్ని చెత్త గా మార్చేశారని, ఆ చెత్తంతా చంద్రబాబు క్లీన్ చేస్తున్నారని బుద్దా వెంకన్న అన్నారు. 35 రోజుల్లోనే ఆ చెత్త అంతా క్లీన్ అయిపోతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ టూర్లు చేస్తున్నారని, ఎప్పుడైనా జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు రాష్ట్ర అభివృద్ధికి పని చేశారా? అని ప్రశ్నించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదన్న బుద్దా వెంకన్న ఇప్పటికి ప్రజలు వైసీపీని అసహ్యించుకుంటున్నారన్నారు.. ఆ 11 సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు ఆలోచిస్తున్నారని, పూర్తిగా భూస్థాపితం చేస్తే బాగుండు అనుకుంటున్నారని బుద్దా వెంకన్న అన్నారు.
Next Story