Mon Dec 23 2024 03:12:54 GMT+0000 (Coordinated Universal Time)
కేశినేనీ... చంద్రబాబు ఎందుకు? కార్యకర్త చాలడూ
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై పోటీకి చంద్రబాబు వరకూ అనవసరమని, టీడీపీ సామాన్య కార్యకర్త చాలని బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ ఓటు బ్యాంకుతో గెలిచిన కేశినేని నాని అంతా తన వల్లననే భ్రమలో ఉండి అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
కోవర్టు రాజకీయాలకు...
కోవర్టు రాజకీయాలకు కేశినేని నాని తెరలేపారన్న బుద్ధా వెంకన్న చంద్రబాబు దగ్గర మాట్లాడిన మాటలను విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డికి చేరవేశారని ఆరోపించారు. బడుగు, బలహీనవర్గాల వ్యతిరేకి కేశినేని నాని అంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ఈసారి కేశినేనికి ఓటమి ఖాయమంటూ బుద్ధా వెంకన్న అన్నారు.
Next Story