Mon Dec 23 2024 12:46:14 GMT+0000 (Coordinated Universal Time)
పెద్దిరెడ్డి ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సిందే
టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు వీరప్పన్ పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అని అన్నారు
టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు వీరప్పన్ పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అని అన్నారు. కొడుకుతో కలిసి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్నారు. వీరి ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారని, వారి దాడులు, దారుణాలుచెప్పకుండా టీడీపీ పై పడి ఏడుస్తున్నారుని తెలిపారు. వారి కబ్జాలు, దోపిడీల గురించి ప్రజలు పిటిషన్లు, వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. పుంగనూరుకే పరిమితం కాకుండా జిల్లా మొత్తం మీద పడి దోచేశారన్నారు. తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, అనచరులు మరోచోట పోటీ చేసి చిత్తూరు జిల్లాలో వేల కోట్లు దోచుకున్నారన్నారు.
చిత్తూరు జిల్లా వీరప్పన్....
చిత్తూరు జిల్లా వీరప్పన్ గా పెద్దిరెడ్డికి నామకరణ చేస్తున్నామని, వారి దోపిడీకి అడ్డం వస్తున్నారనే చంద్రబాబు ను ఓడించేందుకు వందల కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారని తెలిపారు. ప్రజల సొమ్మును దోచుకుని.. ఆ సొమ్ముతో ఓడిస్తాననే గుడ్డి నమ్మకంతో చంద్రబాబుపై శపధం చేశారని చెప్పారు. చంద్రబాబును ఓఢించడం కాదు కదా.. ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారన్నారు. చిత్తూరు జిల్లా వీరప్పన్ పెద్ది రెడ్డి అక్రమ ఆస్తులను అధికారులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని కోరారు. ప్రజలు ఇఛ్చిన ఫిర్యాదులను సుమోటాగా తీసుకుని ఈడీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అన్నారు.
Next Story