Fri Dec 20 2024 11:58:09 GMT+0000 (Coordinated Universal Time)
కొడాలి పై వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు
మంత్రి కొడాలి నాని పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కొడాలి నాని పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 420 పార్టీలో 840 కొడాలి నాని అని అన్నారు. కొడాలి నానిని టీవీల్లో చూసిన పిల్లలు భయపడిపోతున్నారని అన్నారు. సినిమాలకు ముందు ఖైనీ, గుట్కా ప్రకటనలను తొలగించి కొడాలి నాని వల్ల ఎంత ప్రమాదమో ప్రకటనలు చేయాలని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. నందమూరి హరికృష్ణ ఇమేజ్ ను డ్యామేజీ చేసిన వ్యక్తి కొడాలి నాని అని అన్నారు.
రాష్ట్రం విడిచి వెళ్లిపోతా....
ఎన్టీఆర్ ను చంద్రబాబు చంపారన్న కొడాలినాని వ్యాఖ్యలను బుద్దా వెంకన్న తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు చంపాడని కుటుంబ సభ్యులు ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. అలా చెబితే రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. మంత్రి పదవి తీస్తే మరింత రెచ్చిపోతానని కొడాలి నాని వైసీపీ అధినాయకత్వాన్ని బెదిరిస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు
Next Story