Mon Dec 23 2024 23:44:21 GMT+0000 (Coordinated Universal Time)
బుద్దా వెంకన్న విడుదల
టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు విడుదల చేశారు. నిన్న సాయంత్రం అరెస్ట్ చేసిన పోలీసులు అర్ధరాత్రి విడిచి పెట్టారు
తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు విడుదల చేశారు. నిన్న సాయంత్రం అరెస్ట్ చేసిన పోలీసులు అర్ధరాత్రి విడిచి పెట్టారు. మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతం సవాంగ్ పై అనుచిత వ్యాఖ్యలను చేసినందుకు బుద్దా వెంకన్నను నిన్న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు ఆరు గంటల పాటు బుద్దా వెంకన్నను విచారించారు.
ఈరోజు మీడియా సమావేశం....
ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు తర్వాత స్టేషన్ బెయిల్ పై వదిలి పెట్టారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ పోలీసులు తనను ఏమి ప్రశ్నించింది ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తానని చెప్పారు.
Next Story