Thu Dec 19 2024 11:09:40 GMT+0000 (Coordinated Universal Time)
అండర్ పాస్ లు నిర్మించండి : కేంద్రమంత్రి గడ్కరీకి చంద్రబాబు లేఖలు
బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై నెలకొన్న పరిస్థితులను ఆయన అందులో వివరించారు. ఆ ప్రాంతంలో ..
అమరావతి : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రెండు లేఖలు రాశారు. ఆ లేఖల్లో జాతీయ రహదారిపై నెలకొన్న పరిస్థితులను వివరించారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై నెలకొన్న పరిస్థితులను ఆయన అందులో వివరించారు. ఆ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు లేఖ ద్వారా నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
అండర్ పాస్ లేకపోవడం వల్ల స్థానిక గ్రామాల రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి లేఖలో వివరించారు. అలాగే.. నందిగామ మండలం మునగచర్ల వద్ద మరో అండర్ పాస్ నిర్మాణంపై మరో లేఖ రాశారు. మునగచర్ల వద్ద అండర్ పాస్ లేకపోవడం వద్ద ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించిన చంద్రబాబు.. చొరవ తీసుకుని అండర్ పాస్ నిర్మాణాన్ని చేపట్టాలని నితిన్ గడ్కరీకి విన్నవించారు.
Next Story