Mon Dec 23 2024 04:04:24 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం.. రాసిపెట్టుకోండి
రానున్న ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇందులో సందేహపడాల్సిన పనిలేదన్నారు
రానున్న ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇందులో సందేహపడాల్సిన పనిలేదన్నారు. బొప్పూడిలో జరిగిన ప్రజాగళంలో ఆయన మాట్లాడుతూ ఐదుకోట్ల మంది తెలుగు ప్రజల తరుపున మోదీకి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే ఈ సభను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల ఆశల్ని, ఆకాంక్షలను సాకారంచేసే సభ అని ఆయన అన్నారు. ఐదేళ్లలో విధ్వంస పాలనతో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయని, అందుకే ఈ అలయన్స్ ఏర్పడిందన్నారు. అందరూ ఆశీర్వదిస్తే రాబోయే ఎన్నికల్లో ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయిస్తుందన్నారు.
రాష్ట్రాన్ని నాశనం చేసి...
జెండాలు వేరైనా మా అజెండాలు ఒక్కటేనని ఆయన అన్నారు. మోదీ విశ్వగురు అని ఆయనను ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళతామని తెలిపారు. మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్బుపట్టించిన వ్యక్తి జగన్ అని, పోలవరాన్ని పూర్తి చేయకుండా రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. సహజవనరుల దోపిడీ యధేచ్ఛగా సాగిందన్న చంద్రబాబు కల్తీ మద్యంతో అమాయకులను బలితీసుకున్నారన్నారు. ఐదేళ్లలో అభివృద్ధి లేక ఏపీ అనేక రంగాల్లో వెనకబడిపోయిందని చంద్రబాబు అన్నారు.
Next Story