Mon Dec 23 2024 14:15:42 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీపై ఉత్తరాంధ్రలో వ్యతిరేకత
తమను ఎంత టార్గెట్ చేస్తే అంత బలపడతామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
తమను ఎంత టార్గెట్ చేస్తే అంత బలపడతామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టెక్కలి నియోజకవర్గం పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. సర్వే నివేదికలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. కుప్పం, మంగళగిరి, టెక్కలి నియోజకవర్గాలను వైసీపీ లక్ష్యంగా చేసుకుందన్నారు. అయితే ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉందని ఆయన అచ్చెన్నాయుడుతో అన్నారు. దీంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ టీడీపీ పట్ల సానుకూలత పెరిగిందన్నారు.
ఎవరూ నిర్లక్ష్యం చేయకండి....
ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగిందని చంద్రబాబు తెలిపారు. అలాగని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని హితవు పలికారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన నేతలను కోరారు. క్షేత్ర స్థాయిలో టీడీపీ బలంగా ఉందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఆయన చెప్పుకొచ్చారు.
Next Story