Thu Dec 19 2024 18:40:02 GMT+0000 (Coordinated Universal Time)
Dhulipalla Narendra : నీళ్ల చిచ్చు పెట్టింది అందుకు కాక మరెందుకు?
రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు
రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర నీటి హక్కుల ముసుగులో స్వార్థ, ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా సాగర్‌పై దండయాత్ర చేశారని తేటతెల్లమైందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలీసులను జగన్ ఉసిగొలిపారని నరేంద్ర అన్నారు. డెల్టా రైతులు మొత్తుకున్నా సీఎం జగన్ నోరు మెదపలేదని, హఠాత్తుగా తెలంగాణ ఎన్నికల రోజు జగన్నాటకానికి తెరలేపారని నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారి మధ్య చిచ్చుపెట్టడమే జగన్ లక్ష్యమా? అని నరేంద్ర ప్రశ్నించారు.
నాలుగున్నరేళ్లుగా...
రాష్ట్ర సమస్యలపై నాలుగన్నరేళ్లుగా జగన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ప్రజలను ఇంకెంతకాలం జగన్ మోసం చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌ను రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు.నోటిఫికేషన్ విడుదల కారణమెవరు మీరు కాదా? అని నిలదీశారు. తొలి సమావేశంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ట్రైబ్యునల్ ప్రకారం పూర్తి కేటాయింపులు జరిగాయని ధూళిపాళ్ల నరేంద్ర గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలీసులను జగన్ ఉసిగొలిపారన్న నరేంద్ర
Next Story