Mon Dec 23 2024 03:39:42 GMT+0000 (Coordinated Universal Time)
ఇక జిల్లాల వారీగా రెండు పార్టీల సమావేశం : లోకేష్
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల గొంతుకు నొక్కేందుకే ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేష్ తెలిపారు
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల గొంతుకు నొక్కేందుకే ప్రయత్నిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. వంద రోజుల కార్యాచరణను సిద్ధం చేస్తామన్నారు. 29,3031 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో రెండు పార్టీల నేతలు సమావేశం అయి నవంబరు నెల నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. తర్వాత జేఏసీ మీటింగ్ లో భవిష్యత్ కార్యాచరణ ను ఏర్పాటు చేసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామని తెలిపారు. అప్పుల చేసి సంక్షేమం కాదని, అభివృద్ధి చేసి సంక్షేమం చేయడమే తమ లక్ష్యమని నారా లోకేష్ తెలిపారు.
మూడు తీర్మానాలను...
అన్ని వర్గాలను అభివృద్ధి బాటలో పయనించేలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాటం చేయాలని, చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా పొత్తు పెట్టుకోవాలని తీర్మానం చేశామని తెలిపారు. ప్రజల సమస్యల గురించి చర్చించాము తప్పించి తప్ప పదవుల కోసం తాము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన తెలిపారు. 2024లో వైసీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు. కలిసే పోరాడతామని, ఈ రాష్ట్రానికి భరోసా ఇస్తామని చెప్పారు.
Next Story