Mon Dec 23 2024 07:30:08 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : అధికారంలోకి రాగానే ఆదుకుంటాం
తాము అధికారంలోకి వచ్చాక చంద్రన్న భీమా పునరుద్దరిస్తామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు
తాము అధికారంలోకి వచ్చాక చంద్రన్న భీమా పునరుద్దరిస్తామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో ఆయన కూలీలతో మాట్లాడారు. జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో రాష్ట్రంలోని 30లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు పనులులేక రోడ్డున పడ్డారని లోకేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి గ్రేట్ ఇండియా సెంటర్ లో అడ్డాకూలీలతో మంగళవారం ఉదయం భేటీ అయిన యువనేత లోకేష్ వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... భవననిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డునిధులు 2,500 కోట్లను దారిమళ్లించిన జగన్... కార్మికులకు తీరని ద్రోహం చేశారన్నారు.
గత ప్రభుత్వం...
గత ప్రభుత్వంలో అమలుచేసిన చంద్రన్న బీమా పథకాన్ని కూడా రద్దుచేసి తీరని ద్రోహం చేశారన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో నిర్మాణరంగం పడకేసిందని, మూడుముక్కలాటతో అమరావతి పనులు నిలిపేయడంతో కార్మికులు పొట్టచేతబట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. అమరావతి నిర్మాణం కొనసాగించి ఉంటే ఐదు లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ పాలనలో ట్రాక్టర్ ఇసుక రూ.1500 ఉంటే.. జగన్ రెడ్డి పాలనలో రూ.5వేల నుంచి రూ.7వేల వరకు పెరిగిందన్నారు. దీంతో నిర్మాణరంగం కుదేలై భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు.
Next Story