Sat Apr 27 2024 18:54:41 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh comments on Jagan : ఇంటికి కిలో బంగారమిచ్చినా గెలవవు జగన్
ఇంటికి కిలో బంగారమిచ్చినా మీకు ఓటమి తప్పదు అని జగన్ ను టీడీపీ నేత నారా లోకేష్ హెచ్చరించారు
Nara Lokesh comments on Jagan :ఇంటికి కిలో బంగారమిచ్చినా మీకు ఓటమి తప్పదు అని జగన్ ను టీడీపీ నేత నారా లోకేష్ హెచ్చరించారు. అయిదేళ్ల అరాచకపాలనతో విసిగిపోయిన ప్రజలు జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ లో బంధించాలని నిర్ణయానికొచ్చారన్నారు. చీప్ ట్రిక్స్ తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని ఆయన అననారు. ల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు.
డబ్బుల డంప్ ను ఎప్పుడు?
రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన గోడౌన్ లో రాష్ట్రవ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్ ను అధికారులు పట్టుకున్నారన్నారు. తెలుగుదేశం ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంప్ నైతే పట్టుకున్నారు కాని, మరి ఇసుక, లిక్కర్ లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధంచేసిన డబ్బుల డంప్ ను ఎప్పుడు పట్టుకుంటారు? అని లోకేష్ ప్రశ్నించారు.
Next Story