Thu Dec 19 2024 16:51:43 GMT+0000 (Coordinated Universal Time)
తుఫాను పోయింది.. యాత్ర మొదలైంది
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మళ్లీ మొదలైంది. మిగ్జామ్ తుపాను కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తుపాను ప్రభావం ముగియడంతో లోకేశ్ పాదయాత్ర మళ్లీ మొదలుపెట్టారు. డిసెంబరు 9న పిఠాపురం నియోజకవర్గంలోని శీలంవారి పాకలు జంక్షన్ నుంచి యువగళం యాత్ర కొనసాగించారు. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభించారు. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 216 రోజుల్లో 2,974 కిలోమీటర్ల దూరం నడిచారు.
217వ రోజు (9-12-2023) యువగళం వివరాలు
పిఠాపురం/తుని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఉదయం
8.00 – శీలంవారిపాకలు జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.30 – కోనపాపపేటలో మత్స్యకారులతో సమావేశం.
11.00 – శ్రీరాంపురంలో ఎస్సీలతో సమావేశం.
11.05 – పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
మధ్యాహ్నం
12.05 – జిఎంఆర్ హాస్పటల్ వద్ద భోజన విరామం.
3.00 – కాకినాడ సెజ్ బాధిత రైతులతో ముఖాముఖి సమావేశం.
సాయంత్రం
4.00 – జిఎంఆర్ హాస్పటల్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.30 – బుచ్చయ్యపేట సెంటర్ లో గ్రామస్తులతో సమావేశం.
6.00 – వాకదారిపేట సెంటర్ లో మాటామంతీ.
6.45 – పెరుమాళ్లపురం దివీస్ ఫ్యాక్టరీ వద్ద స్థానికులతో సమావేశం.
రాత్రి
7.00 – ఒంటిమామిడి కొత్తపాకల వద్ద ఆక్వా రైతులతో సమావేశం.
7.45 – ఒంటిమామిడి వద్ద విడిది కేంద్రంలో బస.
Next Story