Mon Dec 23 2024 15:24:52 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్యకు ఆ నలభై కోట్లు ఇచ్చిందెవరు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ఎవరు చేశారో ఇప్పటికైనా తెలిసింది కదా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఆరోజే నిందితులు ఎవరో జగన్ కు తెలుసునన్నారు. సుపారీ 40 కోట్లు ఇచ్చింది ఎవరు అని వర్ల రామయ్య ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు వద్దన్న రోజునే ఈ విషయం జగన్ కు తెలుసునన్న విషయం తమకు అర్థమయిందన్నారు. జగన్ కు సంబంధించిన బంధువులే ఈ హత్యకు పాల్పడ్డారని సీబీఐ దర్యాప్తులో తేలిందని వర్ల రామయ్య అన్నారు.
ప్రజలకు చెప్పాల్సిందే....?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో జగన్ తొలి నుంచి అబద్ధాలు చెబుతూనే వచ్చారని వర్ల రామయ్య అన్నారు. రాజకీయ కక్షలతోనే వివేకా హత్య జరిగిందని తేలిపోయిందని వర్ల రామయ్య తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసుపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ పెదవి విప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
Next Story