Mon Dec 23 2024 10:10:17 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేత వినోద్ కుమార్ జైన్‌కు జీవిత ఖైదు
సెక్షన్ 305 కింద జీవితకాల జైలు శిక్ష విధించింది. పోక్సో యాక్ట్ 9, 10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
విజయవాడ భవానీపురంలో సంచలనం సృష్టించిన బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్ కుమార్ జైన్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. రూ.3 లక్షల జరిమానా కూడా విధిస్తూ పోక్సో కోర్టు తుది తీర్పు వెలువరించింది. సెక్షన్ 305 కింద జీవితకాల జైలు శిక్ష విధించింది. పోక్సో యాక్ట్ 9, 10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. గతేడాది భవానీపురంలో టీడీపీ నేత లైంగిక వేధింపులు తాళలేక అపార్ట్మెంట్ నుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకుంది. స్థానిక లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్లో బాలికను వినోద్ జైన్ వేధింపులకు గురిచేసినట్లుగా దర్యాప్తులో తేలింది. వేధింపులను ఎవరికి చెప్పుకోలేక బాలిక బలవన్మరణానికి పాల్పడింది. సూసైడ్ నోట్లో వినోద్ దారుణాలపై ప్రస్తావించింది.
ఈ కేసులో బాధితుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. స్పెషల్ పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ, ‘‘లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్లో బాలికను వినోద్ జైన్ వేధింపులకు గురి చేశారు. ఎవరికి చెప్పలేని విధంగా బాలికను లైంగికంగా వేధించారు. సూసైడ్ నోట్లో వినోద్ జైన్ వేధింపులను బాలిక స్పష్టంగా రాసింది. బాలిక మరణం నుండి బాధిత కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోలేదు’’ అని అన్నారు.
Next Story