రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి.. అసలు నిజాలు ఇవి
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ మృతిచెందాడు. డెంగ్యూ కారణంతో ఆ ఖైదీ
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ మృతిచెందాడు. డెంగ్యూ కారణంతో ఆ ఖైదీ మృతి చెందాడు. రిమాండ్ ఖైదీ మృతిపై జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ మాట్లాడుతూ.. గంజేటి వీర వెంకట సత్యనారాయణ అనే యువకుడు దోపిడి కేసులో సెప్టెంబర్ 6వ తేదీన రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారు. 7వ తేదీన రాజమండ్రి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జైలు అధికారులు చేర్పించారు. అత్యవసర వైద్య సహాయం నిమిత్తం ఈనెల 19వ తేదీన కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కానీ, డెంగ్యూతో ఈ నెల 20వ తేదీన సాయంత్రం రిమాండ్ ఖైదీ మృతిచెందాడు. జైలుకు వచ్చేటప్పటికే సత్యనారాయణ జ్వరంతో బాధపడుతున్నాడని అధికారులు తెలిపారు. ప్లేట్ లెట్స్ సంఖ్య బాగా పడిపోవడమే అతడు చనిపోడానికి కారణమని తెలిపారు. అతడిని కాపాడడానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారని.. అయితే ప్లేట్ లెట్స్ సంఖ్య లక్షా 50 వేలకు పడిపోయాయని స్పష్టం చేశారు. జైలులో దోమల నివారణకు ఆరోగ్యశాఖతో కలిసి చర్యలు చేపట్టామని.. ఫాగింగ్ కూడా చేశామని తెలిపారు.