Sun Dec 22 2024 16:41:39 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : కొడాలి నాని నామినేషన్ ను తిరస్కరిస్తారా? హాట్ టాపిక్
కొడాలి నాని నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్పై వివాదం జరుగుతుంది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు.
తప్పుడు సమాచారం ఇచ్చారంటూ...
తప్పుడు సమాచారమిచ్చిన కొడాలి నాని నామినేషన్ను తిరస్కరించాలని టీడీపీ నేతలు కోరారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ వినియోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్లో పేర్కొన్న నేపథ్యంలో ఆధారాలతో తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Next Story