Fri Nov 15 2024 13:35:15 GMT+0000 (Coordinated Universal Time)
నానీ ...మమ్మల్ని చంపు.. లేకుంటే నిన్ను చంపేస్తాం
మాజీ మంత్రి కొడాలి నానిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. టీడీపీ యే కొడాలి నానికి రాజకీయ బిక్ష పెట్టిందన్నారు. లోకేష్ కాలి గోటికి కూడా నాని సరిపోడని వ్యాఖ్యానించారు. కొడాలి నానికి విశ్వాసం లేదని వారు మండి పడ్డారు.
ప్రయివేటు కేసులు....
పోలీసులు చర్యలు తీసుకోకపోతే కొడాలి నానిపై ప్రవేటు కేసులు పెడతామని వారు హెచ్చరించారు. అలాగే పోలీసులపై కూడా ప్రయివేటు కేసులు వేస్తామన్నారు. కొడాలి నానిని తరిమికొట్టే రోజులు వచ్చాయని వారన్నారు. నానిని గుడివాడ నుంచి పెకిలిస్తామని టీడీపీ నేతలు అన్నారు. 2024లోపు తమను చంపాలని, లేకుంటే 2024 తర్వాత తాము కొడాలి నానిని చంపేస్తామని బుద్దా వెంకన్న హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, నెట్టెం రఘురాం, బుద్దా వెంకన్న, గద్దె రామ్మోహన్ , దేవినేని ఉమ, వర్ల రామయ్య తదితరులున్నారు.
Next Story