Mon Dec 23 2024 12:26:07 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేతల వద్ద కూడా గోప్యంగా రాధా
వంగవీటి రాధాతో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఆయన హత్యకు రెక్కీ నిర్వహించడంపై ఆరా తీశారు.
వంగవీటి రాధాతో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఆయన హత్యకు రెక్కీ నిర్వహించడంపై ఆరా తీశారు. ఇటీవల తన హత్యకు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర డీజీపీకి లేఖ కూడా రాశారు. ఈరోజు టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్ రావు, బోడే ప్రసాద్ రాధా నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.
గన్ మెన్లను....
జగన్ ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్లను కూడా వంగవీటి రాధా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో రాధాకు టీడీపీ అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తుంది. పార్టీ వెనక ఉందన్న విషయాన్ని రాధాకు వారు వివరించినట్లు తెలిసింది. వంగవీటి రాధా మాత్రం తనపై హత్యకు రెక్కీ ఎవరు చేసిందీ వీరికి కూడా చెప్పలేదని తెలుస్తోంది. పోలీసు అధికారులకు మాత్రమే వంగవీటి రాధా చెప్పనున్నారు.
Next Story