Mon Dec 23 2024 05:09:55 GMT+0000 (Coordinated Universal Time)
మోత మొగిద్దాం అంటున్న టీడీపీ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు గారికి మద్దతుగా సెప్టెంబర్ 30, 2023 రాత్రి 7గంటల నుండి 7గంటల 5నిమిషాల వరకు ఐదు నిమిషాల పాటు ఎక్కడ ఉన్నా బయటకు వచ్చి గంట కొట్టండి లేదా ప్లేట్ మీద గరిటతో కొట్టండి అంటూ పిలుపునిచ్చింది టీడీపీ. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టాలని, విజిల్ ఉంటే విజిల్ వెయ్యాలని.. ఏదో ఒకరకంగా 7గంటల నుండి 7గంటల 5 నిమిషాల వరకు చంద్రబాబు కోసం మోత మోగించండి అంటూ తెలుగుదేశం పార్టీ పేర్కొంది. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని టీడీపీ పిలుపునిచ్చింది.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా ‘‘మోతమోగిద్దాం’’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు పెడితే వెనక్కి తగ్గబోమని నిరూపిద్దాం. చంద్రబాబుకు తెలుగువారంతా మద్దతిస్తున్నారని నిరూపించే సమయమిది. శనివారం రాత్రి ఉన్నచోటే మోత మోగించి ప్రజాశబ్దం వినిపిద్దాం’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
Next Story