Mon Dec 23 2024 11:00:22 GMT+0000 (Coordinated Universal Time)
Mudragada : నేడు ముద్రగడ ఇంటికి టీడీపీ నేతలు
కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి నేడు టీడీపీ నేతలు వెళ్లనున్నారు
కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి నేడు టీడీపీ నేతలు వెళ్లనున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులంతా కలసి పని చేయాలని ఆయనకు చెప్పనున్నారు. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఈరోజు ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లనున్నారు. టీడీపీ, జనసేన కూటమికి ఈ ఎన్నికల్లో మద్దతివ్వాలని ఆయన కోరనున్నారు. కిర్లంపూడిలో ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరపునున్నారు.
నిన్న జనసేన నేత కలసి..
ఈ ఎన్నికల్లో కాపులంతా ఒక్కటై వైఎస్ జగన్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేసేందుకు సహకరించాలని, తమతో కలసి రావాలని ఆయన కోరనున్నారు. నిన్న జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ముద్రగడను కలసి తమతో కలసి రావాలని కోరిన సంగతి తెలిసిందే. కాపు పెద్దలంతా ఈసారి కలసికట్టుగా పనిచేయాలని పవన్ కల్యాణ్ రాసిన లేఖను ఆయనకు అందించారు. ముద్రగడ కూడా పవన్ లేఖ పట్ల సానుకూలంగానే స్పందించినట్లు తెలిసింది.
Next Story