Mon Dec 15 2025 03:49:04 GMT+0000 (Coordinated Universal Time)
అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం.. చంద్రబాబు మినహా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించింది. కానీ పొలిట్ బ్యూరో అభిప్రాయాన్ని తోసిరాజని టీడీఎల్పీ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించడం విశేషం. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు.
పొలిట్ బ్యూరో అభిప్రాయం కాదని....
దీంతో చంద్రబాబు కూడా దీనికి అంగీకరించారు. ఈ నెల 7వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు మినహా మిగిలిన టీడీపీ సభ్యులందరూ హాజరవుతారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని సభలోనే ప్రశ్నించాలని భావిస్తున్నారు. అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ అంశంపై చర్చ జరిగే అవకాశమున్నందున అసెంబ్లీకి వెళ్లడమే మంచిదని ఎమ్మెల్యేలు సూచించడంతో చంద్రబాబు కూడా ఓకే చెప్పారు.
Next Story

