Mon Dec 23 2024 18:23:09 GMT+0000 (Coordinated Universal Time)
ప్రారంభమైన మహానాడు వేడుకలు..భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు
ఒంగోలు వేదికగా జరుగుతున్న ఈ మహానాడు కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు వేలాదిగా తరలివచ్చారు. కరోనా తర్వాత జరుగుతున్న..
ఒంగోలు : ప్రతి ఏటా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మూడ్రోజులపాటు టిడిపి ఆధ్వర్యంలో మహానాడును నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా మహానాడు వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ కు నివాళి అర్పించడంతో మహానాడు వేడుకలు మొదలయ్యాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి, నివాళి అర్పించారు. అనంతరం పార్టీకోసం ప్రాణాలర్పించిన కార్యకర్తలకు అంజలి ఘటించారు.
ఒంగోలు వేదికగా జరుగుతున్న ఈ మహానాడు కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు వేలాదిగా తరలివచ్చారు. కరోనా తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో.. సభా వేదికంతా తెలుగు తమ్ముళ్లతో నిండిపోయింది. కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది. పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీలు ఇతర కీలక నేతలు దాదాపు 200 మందికి పైగా వేదికపై ఆసీనులయ్యారు.
Next Story