Sun Mar 16 2025 12:54:01 GMT+0000 (Coordinated Universal Time)
అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వరసగా నాలుగోరోజు టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వరసగా నాలుగోరోజు టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీీతారాం రూలింగ్ ఇచ్చారు. సభలోకి సెల్ ఫోన్లు, ప్లకార్డులు పట్టుకు రాకూడదని రూలింగ్ ఇచ్చారు. దీనిపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు సెల్ ఫోన్లు తీసుకువస్తున్నారని అనగా, అందరికీ ఒకే రూల్ అని స్పీకర్ చెప్పారు. సభా కార్యక్రమాలకు పదే పదే అడ్డుతగులుతుండటంతో స్పీకర్ టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సభా కార్యక్రమాలకు....
సభ ప్రారంభం అయిన వెంటనే జంగారెడ్డిగూడెం మరణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. నినాదాలు చేశారు. సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసును స్పీకర్ తిరస్కరించడంతో వారు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దీంతో సభ నుంచి స్పీకర్ ఒకరోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
Next Story