Thu Dec 19 2024 16:38:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అన్నమయ్య జిల్లాకు చంద్రబాబు
టీడీపీ మినీ మహానాడు నేడు అన్నమయ్య జిల్లాలో జరగనుంది. మదనపల్లిలో జరగనున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు
తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నేడు అన్నమయ్య జిల్లాలో జరగనుంది. మదనపల్లిలో జరగనున్న ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతారు. ఈ నెల 6,7,8 తేదీల్లో చంద్రబాబు అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మదనపల్లిలో మినీ మహానాడుకు టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మదనపల్లె బైపాస్ రోడ్డులోని 45 ఎకరాల్లో ఈ మినీ మహానాడు జరగనుంది. చంద్రబాబు రెండు రోజుల పాటు అన్నమయ్య జిల్లాలోనే ఉంటారు.
మినీ మహానాడులో...
ఈరోజు ఉదయం 10.45 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 4 గంటలకు మదనపల్లె చేరుకుంటారు. మినీ మహానాడులో పాల్గొంటారు. రాత్రి మదనపల్లెలోని ఒక కల్యాణమండపానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. రేపు జిల్లా నియోజకవర్గాల సమీక్షల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఎల్లుండి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు.
Next Story