Mon Dec 23 2024 14:39:12 GMT+0000 (Coordinated Universal Time)
నా రాజీనామాను ఆమోదించండి
తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు
తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్ కు లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి గంటా కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో పంపారు.
ఏడాది గడుస్తున్నా....
అయితే ఏడాది గడుస్తున్నా గంటా శ్రీనివాసరావు రాజీనామాపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. ఒకసారి వ్యక్తిగతంగా కలసి తన రాజీనామాను ఆమోదించాలని గంటా కోరారు. రాజీనామా లేఖ స్పీకర్ కు పంపిన నాటి నుంచి గంటా శ్రీనివాసరావు అసెంబ్లీకి హాజరు కావడం లేదు. తన రాజీనామా లేఖను వెంటనే ఆమోదించాలని ఆయన మరోసారి స్పీకర్ ను కోరారు.
Next Story