Wed Dec 25 2024 01:08:34 GMT+0000 (Coordinated Universal Time)
50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారన్న గోరంట్ల
యాభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు
యాభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. వైసీపీ హైకమాండ్ పై వ్యతిరేకతతో ఉన్న ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామని చెబుతున్నారన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఈ హాట్ కామెంట్స్ చేశారు. యాభై మంది వరకూ తమతో టచ్ లో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.
గంటా రాజీనామాను...
రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్థిని నిలబెడితే తాము గెలిపించుకుంటామని వైసీీపీ ఎమ్మెల్యేలే తమతో చెబుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. వారు వైసీపీ నాయకత్వంతో విసిగిపోయి ఉన్నారన్నారు. గంటా శ్రీనివాసరావు మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పటి వరకూ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల సమయంలోనే ఆయన రాజీనామాను ఆమోదించాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు.
Next Story