TDP : మాధవిరెడ్డి కావాలనే అలా చేస్తున్నారా? క్రేజ్ కోసమేనా? కుర్చీ కోసమా?
కడప జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా మాధవి రెడ్డి పేరు వినపడుతుంది
కడప జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా మాధవి రెడ్డి పేరు వినపడుతుంది. కడప జిల్లాలో మాత్రమే కాదు టీడీపీలో ఆమె పేరు మారు మోగిపోతుంది. ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఎదుగుతుంది. గెలిచింది ఒకేసారి అయినప్పటికీ ఆమె కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. కడప రెడ్డమ్మగా ఆమె దూకుడుతో వ్యవహరిస్తున్న తీరు పార్టీకి భవిష్యత్ లో అనుకూలిస్తుందా? వ్యతిరేకమవుతుందా? అని పక్కన పెడితే మాధవి రెడ్డి మాత్రం కడప జిల్లాలో టీడీపీలో ఫైర్ ఉన్న లీడర్ గా ఎదిగేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారు. కడప జిల్లా వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కావడంతో మాధవీ రెడ్డి తీరును రాష్ట్రమంతటా గమనిస్తుంది. అదే సమయంలో పార్టీకూడా అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now