Mon Dec 23 2024 01:41:31 GMT+0000 (Coordinated Universal Time)
భారీ ర్యాలీతో బయలుదేరిన బాలకృష్ణ
హిందూపురం నుంచి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ ర్యాలీతో అనంతపురం బయలుదేరారు
హిందూపురం నుంచి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ ర్యాలీతో అనంతపురం బయలుదేరారు. అనంతపురంలోని జిల్లా కలెక్టర్ ను ఆయన కలవనున్నారు. ఆయనతో పాటు అఖిలపక్ష నేతలు కూడా కలెక్టర్ ను కలవనున్నారు. హిందూపురం నుంచి బాలకృష్ణ భారీ గా ర్యాలీగా బయలుదేరారని తెలుసుకున్న పోలీసులు అనంతపురంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
అనంతపురం.....
కలెక్టర్ కార్యాలయంలోకి ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న వారినే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బాలకృష్ణ వెంట పార్టీ నేతలతో పాటు అఖిలపక్ష నేతలు కూడా ఉన్నారు. హిందూపురంలోనే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ బాలకృష్ణ కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించనున్నారు.
Next Story