Thu Jan 09 2025 18:14:22 GMT+0000 (Coordinated Universal Time)
జంగారెడ్డిగూడెంకు బయల్దేరిన టిడిపి ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కల్తీ సారా మరణాలపై చర్చించాలని టిడిపి పట్టుబట్టగా.. అవి సాధారణ మరణాలేనని, టిడిపి రాద్దాంతం..
జంగారెడ్డిగూడెం : కొద్దిరోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుసగా నమోదైన కల్తీ సారా మరణాలు ఏపీని కుదిపేశాయి. అధికార పార్టీ ధనదాహానికి.. అమాయక ప్రజలు కల్తీసారా తాగి మృతి చెందారని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి నేతలు ఆరోపించారు. కల్తీ సారా మరణాలు రాజకీయంగా తీవ్రదుమారం రేపాయి. రాష్ట్ర ప్రభుత్వంపై టిడిపి సహా బీజేపీ, జనసేన, విపక్షాలు విమర్శలు గుప్పించాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కల్తీ సారా మరణాలపై చర్చించాలని టిడిపి పట్టుబట్టగా.. అవి సాధారణ మరణాలేనని, టిడిపి రాద్దాంతం చేస్తోందంటూ అధికార పార్టీ నేతలు తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఇటీవలే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాల సభ్యులను పరామర్శించారు. తాజాగా టిడిపి ఎమ్మెల్యేలు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు జంగారెడ్డిగూడెంకు బయల్దేరారు. పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ నుంచి అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో గూడెంకు పయనమయ్యారు. మృతుల కుటుంబాలను పరామర్శించి.. మొత్తం 27 కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున రూ. 27 లక్షల పరిహారం ఇవ్వనున్నారు.
Next Story