Mon Dec 23 2024 08:28:09 GMT+0000 (Coordinated Universal Time)
ప్రిజనరీ పాలనలో నెంబర్ వన్
నేరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఏ1గా నిరూపించుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
నేరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఏ1గా నిరూపించుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆర్థిక నేరాలను ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో ఈ కేసులు సంఖ్య 9,273కు పెంచారంటూ ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిభకు ఇది నిదర్శనమని లోకేష్ ట్వీట్ చేశారు. ఇటువంటి కేసులు 2019లో 188 నమోదు కాగా, వీటిని 420కి చేర్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ఫైర్ అయ్యారు.
దేశద్రోహం కేసుల్లో....
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ విషయాలను వెల్లడించిందన్నారు. గత ఏడాది దేశ వ్యాప్తంగా 76 దేశద్రోహం కేసులు నమోదయితే ఇందులో 29 దేశద్రోహం కేసులు ఏపీలో నమోదయ్యాయన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారందరిపైనా దేశ ద్రోహం కేసులు నమోదు చేస్తున్నారన్నారు. విజనరీ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ అయితే ప్రిజనరీ జగన్ రెడ్డి పాలనలో నేరాల్లో నెంబర్ వన్ అయిందని లోకేష్ ఎద్దేవా చేశారు.
Next Story