Mon Dec 23 2024 09:06:09 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ లేకుండానే ముఖ్య సమావేశాలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిపొలిట్బ్యూరో సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈరోజు జరిగే ప్రతినిధుల సభకు కూడా హాజరు కారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ పొలిట్బ్యూరో సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈరోజు జరిగే ప్రతినిధుల సభకు కూడా లోకేష్ హాజరు కారు. లోకేష్ యువగళం పాదయాత్రలో ఉండటంతో ముఖ్యమైన ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండి పోవాల్సి వచ్చింది. లోకేష యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. లోకేష్ పాదయాత్ర నేటితో 54వ రోజుకు చేుకుంటుంది. పెనుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రకు పెద్దయెత్తున ప్రజలు హాజరవుతున్నారు.
54వ రోజు పాదయాత్ర...
ఈరోజు ఉదయం సోమందేపల్లి నలతగొండ్రాయపల్లి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. సోమందేవపల్లిలో దళితవాడలో ఎస్సీ వర్గీయులతో సమావేశమవుతారు. అనతరం 8.50 గంటలకు మహిళలతో భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం ఎన్టీఆర్ కూడలిలో చేనేతలతో జరగనున్న సమావేశంలో పాల్గొంటారు. 10.30 గంటలకు పెనుకొండ మండలం వెంకటాపురం తండాలో అక్కడి ప్రజలతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు పెనుకొండ శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం వద్ద స్థానికులతో మాటా మంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఒంటి గంటకు వ్యాపారులతో సమావేశమవుతారు. రెండు గంటలకు అక్కడే భోజనం చేస్తారు. అనంతరం బయలుదేరి రాత్రి 8 గంటలకు పెనుకొండ క్రాస్ వద్ద రాత్రికి బస చేయనున్నారు.
Next Story