Sun Dec 22 2024 22:57:27 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ బస్సులో నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఆయన కాసేపు ప్రయాణికులతో ముచ్చటించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఆయన కాసేపు ప్రయాణికులతో ముచ్చటించారు. సత్యవేడు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ పిచ్చాటూరు సమీపంలో ఆర్టీసీ బస్సులోకి ఎక్కారు. ప్రయాణికులను అడిగి ఆర్టీసీ ఛార్జీలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వానికి, వైసీీపీ సర్కార్ హయాంలో ఆర్టీసీ ఛార్జీల మధ్య వ్యత్యాసాన్ని ఆయన వారితోనే చెప్పించారు.
పెంచిన ఛార్జీలపై...
వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని కొందరు ప్రయాణికులు లోకేష్ తో చెప్పారు.చార్జీలు పెంచారని, ఇది తమకు భారంగా మారిందని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత పడుతున్న ఇబ్బందుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ఛార్జీలను ఈ ప్రభుత్వం మూడు సార్లు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై భారాన్ని మోపిందని నారాలోకేష్ ఈ సందర్భంగా విమర్శలు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసి సిబ్బంది జీవితాలను గాలికి వదిలేశారన్నారు.
Next Story