Mon Dec 23 2024 17:09:18 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : హత్య చేసినా నో కేస్.. నో యాక్షన్ : లోకేష్
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని నారా లోకేష్ ఖండించారు
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ప్రవీణ్ కుమార్ రెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారని లోకేష్ అన్నారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బీసీ నేత నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.
అన్నీ తెలిసినా...
కనీసం ఆయనపై కేసు కూడా నమోదు చేయలేదని లోకేష్ అన్నారు. సుబ్బయ్యను చంపించింది ఎమ్మెల్యే బావమరిది బంగారురెడ్డి అని పోలీసులకు తెలిసినా పట్టించుకోలేదన్నారు. ఎందుకు యాక్షన్ తీసుకోలేదని నారా లోకేష్ ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని, తాము అధికారంలోకి రాగానే తామేంటో చూపిస్తామని లోకేష్ సవాల్ విసిరారు.
Next Story