Tue Dec 24 2024 16:25:36 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : సాలూరు సభలో రజనీపై లోకేష్ పంచ్లు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రి విడదల రజనిపై విమర్శలు చేశారు. సాలూరు సభలో ఆయన ప్రసంగించారు
చంద్రబాబు నాటిన తులసి మొక్కనని వైద్యశాఖ మంత్రిని అని విడదల రజని అన్నారని, జగన్ పరిపాలనలో గంజాయి మొక్కగా ఎలా మారారని అడుగుతున్నానంటూ లోకేష్ ప్రశ్నించారు. సాలూరు శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించారు. జగన్ కు సినిమాల పిచ్చి బాగా ఎక్కువైందన్న తోకేష్ తమ సినిమాలు తీసే నిర్మాతకు రెండెకరాల ప్రభుత్వ భూమి ఇచ్చారన్నారు. సాలూరులో ఇండోర్ స్టేడియం కడతామని జగన్ హామీ ఇచ్చారని, యాత్ర-2లో జగనే నటిస్తే ఆ సినిమా కాస్త హిట్ అయ్యేదేమోనని ఎద్దేవా చేశారు. ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ చెప్పారని, ఈ జగన్ ఏనాడూ ప్రత్యేక హోదా గురించి అడగలేదన్న లోకేష్ ఏపీ గురించి వైసీపీలోని ఒక్క ఎంపీ కూడా ఆలోచించలేదన్నారు. జగన్ కుంభకోణాలు అన్నింటిలో ఏ2 విజయసాయిరెడ్డి ఉన్నారని ఆరోపించారు.
అందరి మధ్య చిచ్చు పెట్టి...
కులం, మతం, ప్రాంతాల వారీగా జగన్ మనలో చిచ్చు పెడుతున్నారని, వైసీపీ చేపట్టిన సామాజిక బస్సు యాత్ర విఫలమైందన్న లోకేష్ సొంత సామాజికవర్గం నేతలు ఎవరినీ జగన్ బదిలీ చేయలేదన్నారు. వైసీపీలో బీసీలకు గౌరవం లేదని ఆ పార్టీ నేతలే చెప్పారని, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, బీసీలు అంతా కలిసి పోరాడి జగన్ వెన్నుముక విరగ్గొట్టాలని లోకేష్ పిలుపు నిచ్చారు. రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమాన్నీ నిలిపివేశారని, రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తమదేనని అన్న లోకేష్ నిరుద్యోగ యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగాలు ఆలస్యమైతే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపిరు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించే బాధ్యత తనదేనని ఆయన హామీ ఇచ్చారు.
Next Story