Mon Dec 23 2024 13:43:04 GMT+0000 (Coordinated Universal Time)
నిర్మలాసీతారామన్ కు నారా లోకేష్ లేఖ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేఖ రాశారు. వచ్చే జీఎస్టీ మండలి సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేవారు. చేనేత రంగంపై జీఎస్టీ విధించడంతో ఆ రంగ కార్మికుల జీవనం అస్తవ్యస్తంగా మారిందని అభిప్రాయపడ్డారు.
జీఎస్టీ విధింపుపై....
చేనేత కార్మికులను ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలని నారా లోకేష్ తన లేఖలో కోరారు. వారికి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత ఉత్పత్తులపై ప్రభుత్వం జీఎస్టీ ఐదు శాతం విధించడంతోనే భారంగా మారిందని, దానిని ఇప్పుడు 12 శాతానికి పెంచాలనుకోవడం అన్యాయమని లోకేష చెప్పారు. ముడి సరుకులపై 25 శాతం జీఎస్టీ విధించడంతో చేనేత కార్మికులకు భారంగా ఉందన్నారు.
Next Story