Mon Dec 23 2024 08:50:57 GMT+0000 (Coordinated Universal Time)
వారికి నారా లోకేష్ వార్నింగ్
పోలీసు అధికారులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు.
పోలీసు అధికారులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. జగన్ ట్రాప్ లో పడి జైలుకు వెళ్లవద్దని సూచించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులు జైలుకు తీసుకెళ్లారని, ఇప్పుడు ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లను కూడా ఆయన జైలు పాలు చేయబోతున్నాడని హెచ్చరించారుక. తాత్కాలిక ప్రయోజనాల కోసం కొందరు అధికారులు జగన్ రెడ్డికి కొమ్ముకాస్తున్నారన్నారు.
కెరీర్ ను నాశనం చేసుకున్నట్లే...
దీనివల్ల తమ కెరీర్ ను నాశనం చేసుకున్నట్లేనని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. 41ఎ నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్ట్ అంకబాబును ఎలా అరెస్ట్ చేస్తారంటూ న్యాయస్థానం సీీఐడీ అధికారులను ప్రశ్నించిన విషయాన్ని లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పదే పదే కోర్టులు హెచ్చరిస్తున్నా అధికారుల్లో మార్పు రావడం లేదన్నారు. ఆ తర్వాత ఎందుకు తప్పు చేశామా? అని పశ్చాత్తాప పడాల్సి వస్తుందని లోకేష్ అన్నారు.
Next Story