Mon Dec 23 2024 02:28:16 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : మంగళగిరలో రచ్చబండలో లోకేష్
హత్యా రాజకీయాలకు ఏపీలో స్థానం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
Nara Lokesh :హత్యా రాజకీయాలకు ఏపీలో స్థానం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు ఏనాడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోరంపూడి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. టీడీపీకి పట్టుకున్న నియోజవర్గాల్లో పోటీచేయాలని అనేకమంది సూచించినా ప్రజలో, లోకేష్ కావాలో తేల్చుకుంటానని చెప్పానని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా మంగళగిరిని తీర్చిదిద్దుతానని అన్నారు.
వారి సమస్యలు విని...
భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా మోరంపూడి వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. దళిత స్మశాన వాటిక ప్రహరీ గోడ, గది నిర్మించాలని, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, ముస్లిం కబరస్థాన్ కు స్థలం కేటాయించాలని, మహంకాళీ అమ్మవారి దేవస్థానంకు వెళ్లే రహదారిని విస్తరించాలని, చర్చికి టవర్ నిర్మించాలనిన కోరారు. కొందరు తమకు వైఎస్సార్ చేయూత పథకం అందడం లేదని ఫిర్యాుదు చేశారు. ఈ విషయంలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.
Next Story