Thu Dec 19 2024 04:04:58 GMT+0000 (Coordinated Universal Time)
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. మెడకు చుట్టుకుంటుందా?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు సీఐడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు సీఐడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన విచారణ ఎదుర్కొననున్నారు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీగా అలైన్మెంట్ లో మార్పులు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సీఐడీ నేడు లోకేష్ ను విచారించనుంది. ఈ కేసులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణతో పాటు లోకేష్ ను కూడా సీఐడీ నిందితులుగా చేర్చడంతో ఆయన విచారణ ఎదుర్కొనక తప్పడం లేదు.
నిందితుడిగా చేర్చి...
ఏ 14 నిందితుడిగా ఉన్న లోకేష్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు 41ఎ నోటీసులు ఇచ్చి మరీ విచారణకు పిలిచారు. తిరిగి కోర్టును ఆశ్రయించగా ఈ నెల 10వ తేదీన సీఐడీ విచారణకు హాజరు కావాలని లోకేష్ ను ఆదేశించింది. దీంతో ఈరోజు ఉదయం 9 గంటలకు సీఐడీ కార్యాలయానికి లోకేష్ చేరుకోనున్నారు. లోకేష్ డైరెక్టర్గా ఉన్న హెరిటేజ్ సంస్థకు కూడా భారీగా లబ్ది చేకూర్చేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను మార్చారన్న ఆరోపణలపై సీఐడీ అధికారులు నేడు ప్రశ్నించనున్నారు.
కోర్టు ఆదేశం మేరకు...
లోకేష్ తో పాటు మాజీ మంత్రి నారాయణను కూడా విచారణకు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తొలుత లోకేష్ ను ఈ నెల4న విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా, ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పదోతేదీన విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. లోకేష్ విచారణ జరుగుుతుండటంతో సీఐడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. టీడీపీ కార్యకర్తలు ఎవరూ అటు వైపు రాకుంండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story