Sun Dec 22 2024 16:30:03 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : తాడిపత్రికి నేడు నారా లోకేష్
నేడు కూడా అనంతపురం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు
Nara Lokesh :నేడు కూడా అనంతపురం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. శంఖారావం కార్యక్రమంలో భాగంగా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు అనంతపురం వద్ద ఉన్న రుద్రంపేట సభలో లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభకు పెద్దయెత్తున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శ్రేణులు చేరుకున్నాయి. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సభ ద్వారా ప్రజలను కోరనున్నారు.
సూపర్ సిక్స్ కార్యక్రమాలను....
దీంతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన సూపర్ సిక్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా క్యాడర్ ను ఉత్సాహ పర్చనున్నారు. అనంతరం బాబు ష్యూరిటీ - భవిష్యత్కు గ్యారంటీ అమలులో మెరుగైన పనితీరును కనపర్చిన కార్యకర్తలకు ప్రశంసాపత్రాలను కూడా లోకేష్ అందచేయనున్నారు. ఈ మధ్యాహ్నం తాడిపత్రిలో జరిగే శంఖారావం సభకు లోకేష్ హాజరు కానున్నారు. ఈ సభతో మలివిడత శంఖారావం సభలు ముగియనున్నాయి.
Next Story