Wed Apr 02 2025 01:31:19 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : నేటి నుంచి లోకేష్ యువగళం
నేటి నుంచి రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు.

నేటి నుంచి రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఈ ఎన్నికలకు యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా లోకేష్ పర్యటన సాగనుంది. నేటి నుంచి మే 6 వరకు రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో లోకేష్ పర్యటన సాగనుంది. ఈరోజు ఒంగోలులో లోకేష్ పర్యటన ప్రారంభంకానుంది.
ఒంగోలు నుంచి...
రేపు నెల్లూరు, ఎల్లుండి రాజంపేట ఎంపీ నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటన సాగనుంది. మే 3న కర్నూలు, 4న నంద్యాల లోక్ సభ నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటన చేయనున్నారు. మే 5న చిత్తూరు, 6న ఏలూరు లోక్ సభ నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటన ఉండనుంది. లోక్సభ నియోజకవర్గాల్లో నిర్వహించే సభలు, రోడ్ షోలలో లోకేష్ పాల్గొననున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 6 వరకు యువతతో లోకేష్ ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు.
Next Story