Mon Dec 23 2024 08:13:49 GMT+0000 (Coordinated Universal Time)
ఇప్పటం గ్రామానికి నేడు నారా లోకేష్
ఇప్పటం గ్రామంలో నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు
ఇప్పటం గ్రామంలో నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ కోసం ఇళ్లను కూల్చివేత కార్యక్రమాన్ని అధికారులు చేపట్టిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో....
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇప్పటం గ్రామంలో ఇళ్లను కూల్చి వేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇంటికి లక్ష పరిహారం కూడా ప్రకటించారు. ఈరోజు నారా లోకేష్ ఆ గ్రామంలో పర్యటిస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. లోకేష్ బాధితులను పరామర్శించనున్నారు.
Next Story