Mon Dec 23 2024 15:46:26 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ మైకు లాక్కున్న పోలీసులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సభను పోలీసులు అడ్డుకున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సభను పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు రూరల్ మండలంలోని ఎస్ఆర్ పేట ఎన్టీఆర్ సర్కిల్ లో సభను నిర్వహించడానికి లేదని తెలిపారు. పోలీసుల అనుమతి లేదని చెప్పారు. అయితే దీనిపై లోకేష్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కును హరించడం దారుణమన్నారు. జీవో నెంబరు 1 ప్రకారం రోడ్ల మీద సమావేశాలు ఏర్పాటు చేయడానికి వీలులేదని పోలీసులు లోకేష్ కు తెలిపారు.
స్టూల్ పై నిలబడి...
పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్స్ లో సభ నిర్వహించుకోవాలని భావిస్తే అక్కడ కూడా అనుమతివ్వలేదని పేర్కొన్నరాు. సభ ఎక్కడ నిర్వహించుకోవాలో మీరే చెప్పండంటూ లోకేష్ పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, లోకేష్ కు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఎన్టీఆర్ సర్కిల్ లోనే లోకేష్ స్టూల్ పై నిలబడి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జగన్ కు భయం అంటే ఏంటో చూపిస్తానని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. ఎక్కడా అనుమతివ్వకపోతే ఎలా? తాడేపత్రి ప్యాలస్ లో సభ పెట్టుకోవాలా? అని ప్రశ్నించారు. లోకేష్ నుంచి మైకును లాక్కునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
Next Story