Mon Dec 23 2024 06:17:26 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : 27న శ్రీకాకుళానికి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 27న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 27న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రా కదలిరా సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు శ్రీకాకుళంలో సభా ప్రాంగణం, ఇతరత్రా ఏర్పాట్ల పర్యవేక్షణకు పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. గత కొద్దిరోజులుగా రా కదలిరా పేరుతో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
పార్టీ క్యాడర్ను...
ఈ సభలతో పార్టీ క్యాడర్ తో పాటు నాయకులును కూడా ఎన్నికలకు సిద్ధం చేయడానికి చంద్రబాబు ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ఈ సభలకు ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు హాజరు అవుతుండటంతో పార్టీ నేతలు కూడా ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై చంద్రబాబు ఈ సభలకు ముందు నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు.
Next Story