Mon Dec 23 2024 13:37:26 GMT+0000 (Coordinated Universal Time)
టిడిపికి షాకిచ్చిన హ్యాకర్స్.. పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
టిడిపి అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, తిరిగి అకౌంట్ ను పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు..
అమరావతి : టిడిపికి హ్యాకర్స్ షాకిచ్చారు. పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను హ్యాకర్స్ హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఆయన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. టిడిపి అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, తిరిగి అకౌంట్ ను పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. శుక్రవారం రాత్రి అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.
టిడిపి అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఏవేవో విచిత్రమైన ట్వీట్లు కనిపించాయి. ఇదిలా ఉండగా.. ఏపీలో పెగాసస్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారి, పొలిటికల్ హీట్ పెంచాయి. చంద్రబాబు నాయుడు పెగాసస్ ను కొనుగోలు చేశారన్న మమతా వ్యాఖ్యలు.. ఏపీలో అధికార పార్టీ - టిడిపిల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. ఈ క్రమంలో టిడిపి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవడం చర్చనీయాంశమైంది.
Next Story