Mon Dec 23 2024 08:39:24 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
ఈరోజు పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది
ఈరోజు పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎంపీలతో చంద్రాబు భేటీ కానున్నారు. ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చంద్రబాబు సభ్యులతో చర్చించనున్నారు. పార్లమెంటు సభల సందర్భంగా లేవనెత్తాల్సిన అంశాలను ప్రస్తావించనున్నారు.
రాష్ట్ర అవసరాలు...
ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర అవసరాలు వివరించి వచ్చిన చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. శాఖలవారీ సమన్వయం కోసం ఎంపీలకు బాధ్యతలు అప్పగించనున్నారరు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడకుండా పార్లమెంటులో గళం వినిపించాలని ఎంపీలను ఆదేశించనున్నారు.
Next Story