Thu Dec 19 2024 05:51:19 GMT+0000 (Coordinated Universal Time)
కేశినేనిని బెజవాడలో తిరగనివ్వం.. బొండా ఉమ వార్నింగ్
కేశినేని నానిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కేశినేని నానిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తే కేశినేని నానిని విజయవాడలో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు. కేశినానికి రెండు వేల కోట్లు ఆస్తులు ఎక్కడివి అని ఆయన ప్రశ్నించారు. ఆయన అప్పులు చేసి ఎగ్గొట్టే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని అన్నారు. 2014 ఎన్నికల్లో కేశినేని నాని పైగా ఖర్చు పెట్టలేదని, ఖర్చంతా సుజనా చౌదరి ఖర్చు పెట్టారని అన్నారు.
బ్యాంకు రుణాలను ...
బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టేందుకే కేశినేని ట్రావెల్స్ ను ఆయన మూసివేశారన్నారు. అన్ని వేల కోట్ల ఆస్తులు కేశినేని ఎలా సంపాదించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆయనకు అన్ని ఆస్తులు ఒక్క ట్రావెల్స్ పైనే సంపాదిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. 2014-19లో కేశినేని నాని ఆస్తులు పెంచుకుని, అప్పులు తగ్గించుకున్నారన్నారు. కేసుల భయంతోనే కేశినేని నాని తన ట్రావెల్స్ మూసేశారని ఆరోపించారు. కేశినేని నాని ఒక బస్సుకు పర్మిట్ తీసుకుని నాలుగు బస్సులను అక్రమంగా తిప్పేవారని బొండా ఉమ ఫైర్ అయ్యారు.
Next Story