Mon Dec 23 2024 09:41:54 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఎస్పీ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలు
గన్నవరం ఘటనపై ఎస్సీ జాషువా చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు
గన్నవరం ఘటనపై ఎస్సీ జాషువా చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. అక్కడ దారుణలన్నీ రక్షకులు, భక్షకులు జరిపినవేనని ఆయన అన్నారు. గన్నవరం విధ్వంస కాండ మొత్తం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజమేనన్న ఆయన పట్టాభికి తగిలన దెబ్బలు వైద్యులకు కనిపించలేదా? అని ప్రశ్నించారు. దొంతు చిన్నాని, అతని కుటుంబాన్ని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులపై కేసులను ఎలా నమోదు చేస్తారని వర్ల రామయ్య ప్రశ్నించారు. పట్టాభికి ఎంపీ రఘురామ కృష్ణరాజు జరిపించిన ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు.
పట్టాభిని కొట్టలేదనడం...
పట్టాభిని కొట్టలేదనడం అంత అబద్ధం మరొకటి లేదన్నారు. పట్టాభిని అంతగా కొట్టకపోతే చివరకు అన్నం తినే పరిస్థితుల్లో కూడా ఎందుకు లేడని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందని తెలిసిన తర్వాత పట్టాభి గన్నవరం వెళ్లడం ఎలా తప్పవుతుందని అన్నారు. తొలి దశలోనే పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఇంతటి విధ్వంసకాండ జరిగి ఉండేదా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. తన అనుచరులను వంశీ పంపించి దాడులు చేయించింది నిజం కాదా? వైసీపీ గూండాలు టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీసీ నేత దొంతుచిన్నా కారుకు నిప్పు పెట్టిన వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదన్నారు.
Next Story