Tue Apr 08 2025 04:53:23 GMT+0000 (Coordinated Universal Time)
పరిటాల కుటుంబం ధర్నా
చంద్రబాబుపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి.

చంద్రబాబుపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు కారు అద్దాలను కొందరు వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. చంద్రబాబు, లోకేష్ లను పరుష పదజాలంతో దూషించడంతో పెద్ద దుమారం చెలరేగింది.
వైసీపీ నేతలను ....
దీంతో తమ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ పరిటాల సునీత, శ్రీరామ్ లు ధర్నాకు దిగారు. టీడీపీ నేతలను విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని పరిటాల సునీత అంటున్నారు. సీకే పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్దయెత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story