Thu Nov 14 2024 06:31:26 GMT+0000 (Coordinated Universal Time)
నా కాల్ డేటా చూడండి : టీడీపీ రెబల్ ఎమ్మెల్యే మద్దాలి గిరి
కుట్రలు, కుతంత్రాల, వెన్నుపోటు రాజకీయాలాకి పేటెంట్ చంద్రబాబు అని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు
కుట్రలు, కుతంత్రాల, వెన్నుపోటు రాజకీయాలాకి పేటెంట్ చంద్రబాబు అని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. కనీసం పార్టీలో గౌరవం ఇవ్వకపోవడంతోనే పార్టీని వీడామని ఆయన తెలిపారు. గతంలో చంద్రబాబు 23 మంది ఎంఎల్ఏలను కొనుగోలు చేశారన్న మద్దాలి గిరి జగన్ పై ఉన్న అభిమానంతో మేము వైసీపీలో చేరామని తెలిపారు. ఎంఎల్సీ ఎన్నికల తర్వాత మాపై నిందలు వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
లోకేష్ కోసం నాశనం...
తాము టీడీపీని వదిలేసి మూడేళ్లకు పైగా అయిందని ఆయన గుర్తు చేశారు. టీడీపీ పార్టీ పతనం అవ్వడానికి లోకేష్ కారణమని మద్దాలి గిరి అన్నారు. అవగాహన లేని లోకేష్ కోసం పార్టీని నాశనం చేశారన్నారు. జగన్ మమ్మలను సొంత కుటుంబ సభ్యులాగా చూసుకుంటారని, నేను నావాళ్ళు మాత్రమే అనే నైజం చంద్రబాబుదని, వారం రోజులపాటు టీడీపీ నాయకులు ఎంఎల్సీ ఎన్నికల కోసం నన్ను సంప్రదించారని ఆయన అన్నారు. చివరి రోజు వరకు టీడీపీ నాయకులు తన ఓటు కోసం సంప్రదించారని, నా కాల్ డేటాను చూస్తే ఏ నాయకుడు ఫోన్ చేశారో తెలుస్తుందని చెబుతూ కాల్ డేటాను మద్దాలి గిరి చూపించారు.
Next Story